NLG: చిట్యాలలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో భక్తులు అమ్మవారికి సమర్పించిన శేష వస్త్రాలు శుక్రవారం భక్తులకు ఉదయం నుంచి అందుబాటులో ఉంటాయని దేవస్థానం ఛైర్మన్ ఆంజనేయులు గౌడ్ తెలిపారు. అందరూ చీరలను పొందే విధంగా చీరను బట్టి వాస్తవ విలువకు తక్కువగా ధరను నిర్ణయించడం జరిగిందని అన్నారు. మహిళా భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.