BDK: కరకగూడెం మండలం రేగళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని మధులగూడెం గ్రామానికి చెందిన రైతు పామాయిల్ తోటలో అమర్చిన ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి కాపర్‌ను ఎత్తుకెళ్లినట్టు స్థానికులు గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకి మండలంలో కాపర్ దొంగలు రెచ్చిపోతున్నారని అన్నారు. కాపర్ దొంగలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.