KNR: హుజురాబాద్ పట్టణంలోని మోడల్ చెరువు సుందరీకరణలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్నటువంటి చిల్డ్రన్ పార్క్, వాకింగ్ ట్రాక్ పనుల్లో నాణ్యత పాటించాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ అధికారులకు సూచించారు. మోడల్ చెరువును స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.