KMM: మధిర మండలం రాయపట్నం కాంగ్రెస్ తరుపున సర్పంచ్ అభ్యర్థిగా మాజీ సర్పంచ్ బొమ్మకంటి హరిబాబు నామినేషన్ వేశారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. గతంలో గ్రామానికి చేసిన మంచి పనులే తనను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేసే నాయకులను ప్రజలు ఆదరించాలని కోరారు.