ADB: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో 44వ అంతర్ జిల్లా ఖో ఖో పోటీల్లో పాల్గొనడానికి ఉమ్మడి జిల్లా జట్టు గురువారం బయలుదేరినట్లు ఫిజికల్ డైరెక్టర్ రాంకుమార్ తెలిపారు. ఈ మేరకు సామాజిక కార్యకర్త ఏల్చల్ రవిశాస్త్రి క్రీడాకారులకు రూ.15 వేల విలువగల క్రీడా దుస్తులను అందజేసినట్లు పేర్కొన్నారు. జట్టు సభ్యులు ప్రతాప్, శంకర్, అనిల్, శ్రీనివాస్ తదితరులున్నారు.