CTR: పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశం ఛైర్మన్ సేమిపతి యాదవ్ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి రూ.49 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపుతున్నట్లు చెప్పారు. కమిటీ సహకారంతో పుంగనూరు మార్కెట్ యార్డ్‌ను అభివృద్ధిలో జిల్లాలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు.