మెడికల్ కాలేజీల అనుమతుల వ్యవహారంలో దేశవ్యాప్తంగా ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే మెడికల్ కౌన్సిల్ సభ్యులు, కాలేజీలపై సీబీఐ కేసులు నమోదు చేయగా.. తాజాగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీ, యూపీ, మహారాష్ట్రలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.