రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్ను గురువారం విడుదల చేశారు. జిల్లా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష సహకారంతో ఈనెల 28న జిల్లా కలెక్టరేట్ దగ్గర గల రంగినేనిలో జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు సంపత్ కుమార్ చెప్పారు.