భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌కు దూరమైంది. ఈ విషయాన్ని బ్రిస్బేన్ హీట్ జట్టు వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్మృతికి మద్దతుగా ఉండేందుకు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపింది.