KRNL: రైతులను నిజమైన రాజులుగా నిలబెట్టేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందని కర్నూలు జేసీ నూరుల్ ఖమర్ తెలిపారు. ఇవాళ గార్గేయపురంలో నిర్వహించిన “రైతన్నా మీకోసం” కార్యక్రమంలో ఆయన రైతులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సర్వీసులు, సబ్సిడీలు, పంటలకు లాభదాయక ధరలు వంటి పథకాలు రైతు ఆదాయాన్ని పెంచేలా రూపొందించబడినట్లు చెప్పారు.