MNCL: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం ఖాయమని మంత్రి వివేక్ ధీమా వ్యక్తం చేశారు. మందమర్రిలో గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. BRS ప్రభుత్వం అధికార అహంకారంతో అవినీతిలో మునిగిపోయిందని, ఆ అవినీతిని గుర్తించిన ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.