PLD: రూ. 54.09 కోట్ల వ్యయంతో మాచర్ల, రెంటచింతల, గురజాల పట్టణాల్లో చేపట్టనున్న ఇన్నర్ బైపాస్ రోడ్డు విస్తరణ పనులకు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గురువారం భూమిపూజ, శంకుస్థాపన చేశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.