ADB: గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశామని.. బ్యాలెట్ బాక్సులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటికే అధికారులకు పూర్తిస్థాయిలో ఎన్నికలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.