AP: ట్రాన్స్కో, APSPDCL అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విడివిడిగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా విద్యుత్తు సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టు పనుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.