MBNR: పాత పాలమూరు 11వ వార్డులో పిచ్చిమొక్కల సమస్యను స్థానికులు కాంగ్రెస్ నేత ఏర్పుల నాగరాజు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చొరవతో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది గురువారం స్మశాన వాటిక, చెరువు కట్ట ప్రాంతాల్లో డోజర్ సహాయంతో పిచ్చిమొక్కలను తొలగించారు. తమ సమస్యను పరిష్కరించినందుకు నాయకులు, అధికారులు, సిబ్బందికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.