MNCL: జన్నారం మండలంలోని పలు గ్రామాలలో స్థానిక ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ పరిశీలించారు. గురువారం ఆయన పోన్కల్, తదితర గ్రామాలలోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.