SRCL: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం వేకువజామున వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించారు.