SRCL: తంగళ్ళపల్లి మండలం మండేపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలోని RO ప్లాంట్ను పాఠశాల పూర్వ విద్యార్థులు రూ. 8 వేలతో గురువారం పునరుద్ధరించారు. పాఠశాలలోని విద్యార్థులు తాగడానికి RO ప్లాంట్ ఉన్నప్పటికీ కొద్దిరోజులుగా పాడైపోయి పనిచేయడం లేదు. ఇది తెలుసుకున్న పూర్వ విద్యార్థులు గుర్రం నవీన్, తంగళ్ళపల్లి వంశీ, కోళ అనిల్ కుమార్ ముందుకు వచ్చి RO ప్లాంట్ను పునరుద్ధరించారు.