WNP: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి రిటర్నింగ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. నిర్దేశించిన పత్రాలు లేని అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించకుండా, వారికి గడువుతో కూడిన నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. నామినేషన్లను పక్షపాతం లేకుండా, జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.