KRNL: గోనెగండ్లలో జరిగిన రైతన్నా మీ కోసం కార్యక్రమంలో సాగునీటి సంఘాల జిల్లా ఉపాధ్యక్షుడు టమోటా హుస్సేన్ మాట్లాడుతూ.. అన్నదాతలకు కూటమి ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు జమ చేసినట్లు తెలిపారు.