TG: సీఎం రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ మాజీ సీఎం కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీమంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ‘కేసీఆర్ లేకపోతే తెలంగాణే లేదు.. నవంబర్ 29 దీక్ష లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన వచ్చేది కాదు’ అని స్పష్టం చేశారు. ఢిల్లీ పీఠాన్ని కదిలించిన చరిత్ర కేసీఆర్‌దని.. రేవంత్‌ది కేవలం ఓట్ల రాజకీయమేనని హరీష్ రావు ధ్వజమెత్తారు.