కోనసీమ: సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర పథకం కింద విద్యార్థులకు పంపిణీ చేసిన బ్యాగుల నాణ్యతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పుస్తకాలు పెట్టిన వారానికే బ్యాగులు చిరిగిపోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఆయా బ్యాగులను విద్యార్థుల నుంచి వెనక్కి తీసుకున్నారు. అమలాపురం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో భద్రపరిచిన వాటిని కంపెనీకి తిరిగి పంపించారు.