KNR: జమ్మికుంట పట్టణంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించినప్పటికీ ఇప్పటివరకు వాటిని పంపిణీ చేయకపోవడంతో అవి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. రాత్రివేళల్లో అక్కడ మందుబాబులు, కొందరు వ్యక్తులు చేరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఖాళీ ఇళ్లల్లో కిటికీలు, డోర్లు పగలగొట్టి ప్రభుత్వానికి నష్టం చేస్తున్నారన్నారు.