AP: తన రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ ఆమోదించట్లేదని MLC జయమంగళ వెంకటరమణ వేసిన పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం.. వెంకటరమణ రాజీనామాపై మండలి ఛైర్మన్ మోషేన్ రాజు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. వివరాలను సదరు MLCకి వెల్లడించాలని స్పష్టంచేసింది.