కోనసీమ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గురువారం ఆలమూరు మండలం సంధిపూడిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.43.60లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు.