MBNR: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో మండలంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని ఎంపీడీఓ జయరాం నాయక్ తెలిపారు. మండల ప్రజలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోడ్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ హెచ్చరించారు.