GDWL: కేటీ దొడ్డి మండలం నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసులో ప్రధాన నిందితులు 10 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి రూ. 8,50,000 నగదు, 4 కార్లు, 1 బొలెరో, 2 బైక్లు, 11 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.