ELR: బాల్య వివాహాల నిరోధానికి ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రత్యేక ప్రచారంలో భాగంగా ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఇవాళ నారాయణపురంలోని తన కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించి ప్రారంభించారు. బాల్య వివాహాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా అధికారులు అంకితభావంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.