GNTR: ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కోయవారిపాలెంలో పేకాట రాయుళ్లపై గురువారం టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న రూ.8,040 నగదు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, స్టేషన్కి తరలించినట్లు ఎస్సై నరహరి తెలిపారు.