GNTR: కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతాంగానికి అండగా ఉంటూ భరోసా కల్పిస్తోందని MLC ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. తెనాలి మండలంలోని కొలకలూరు, గుడివాడ గ్రామాల్లో గురువారం సాయంత్రం ఆయన పర్యటించారు. రైతుల ఇళ్లకు వెళ్లి ‘రైతన్నా నీకోసం’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి సత్ఫలితాలు పొందాలని ఆయన సూచించారు.