RR: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ లక్ష్మీ మెగా టౌన్షిప్లో శ్రీ కోదండరామచంద్ర మౌలీశ్వర స్వామి దేవాలయాల నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై దేవాలయ నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతకు నిలయాలైన దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.