KDP: బ్రహ్మంగారిమఠంలోని ఆయుర్వేద ఆస్పత్రిని రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ శేఖర్ రాజు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ వివరాలు, హాజరు పట్టి తదితర వివరాలను పరిశీలించారు. బ్రహ్మంగారి మఠానికి మంజూరైన నూతన ఆయుర్వేద భవన నిర్మాణం కోసం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద డాక్టర్ పల్లా మహేష్ తదితరులు పాల్గొన్నారు.