VZM: రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ వి. జోగేశ్వరరావు, ఇతర సభ్యులతో శ్రీ విజయనగరం పైడితల్లమ్మ అమ్మవారిని ఇవాళ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారిణి శిరీష పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణ ఆశీర్వదించారు. ఆనంతరం అమ్మవారిని దర్శనం కల్పించి, అమ్మవారి ఫోటో, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.