అనంతపురం: బుక్కరాయసముద్రం(M) నీలంపల్లిలోని స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎంపీడీవో సల్మాన్ రాజ్, డిప్యూటీ ఎంపీడీవో సదాశివం పాల్గొన్నారు. పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికులు కీలకమన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఎరువు దిబ్బలను తొలగించాలని ప్రజలకు సూచించారు.