SKLM: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే కూన రవికుమార్ ద్విచక్ర వాహనంపై ఆమదాలవలస మున్సిపాలిటీలో పర్యటించారు. ఇవాళ స్థానిక వ్యాపారస్తులతో పాటు, స్థానికులతో మాట్లాడుతూ.. సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. సమస్య ఉంటే తక్షణ పరిష్కారం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.