ADB: సీపీఆర్‌పై తప్పనిసరిగా అవగాహన ఉండాలని మండల వైద్యాధికారి నిఖిల్ రాజ్ సూచించారు. గురువారం భీంపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో సీపీఆర్‌పై గ్రామస్తులకు అవగాహన ఏర్పాటు చేశారు. గుండెపోటు వచ్చినప్పుడు సీపీఆర్ ద్వారా ప్రాణాలు ఎలా కాపాడుకోవచ్చో వివరించినట్లు పేర్కొన్నారు. సిబ్బంది, మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి జ్ఞానేశ్వర్, తదితరులున్నారు.