SRPT: తుంగతుర్తి మండలం అన్నారంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ తరపున కుంచాల శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దొంగరి శ్రీనివాస్, కంచర్ల రామకృష్ణారెడ్డి, గ్రామస్తులు పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.