ఖమ్మం త్రీటౌన్ ప్రకాష్ నగర్ ఏరియాలో పేదల ఇళ్లు కూల్చి రోడ్ విస్తరణ పనులు జరుగుతున్నందున సీపీఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. వెంటనే రోడ్ విస్తరణ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కేఎంసీ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆపార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ ఆధ్వర్యంలో KMC అధికారులకు వినతిపత్రం అందజేశారు.