సంగారెడ్డి మండలంలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఈఎల్డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి ప్రతిభ పరీక్షను మండల విద్యాధికారి విద్యాసాగర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇటువంటి పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు ఈ పరీక్షలను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవలన్నారు.