సత్యసాయి: రొద్దం మండలం ఆర్.మరువపల్లిలో రైతన్న-మీకోసం కార్యక్రమం గురువారం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి రాజేశ్ మాట్లడుతూ.. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ డబ్బులు పడని వారు రైతు సేవా కేంద్రం సిబ్బంది దగ్గర దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రైతు సేవా కేంద్రంలో జిప్సం, జింక్ సల్ఫేట్ అందుబాటులో ఉన్నాయని కావలసిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.