కరీంనగర్‌కు వచ్చిన పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకులు, HACA మేనేజింగ్ డైరెక్టర్ కె. చంద్రశేఖర్ రెడ్డితో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో సమావేశమయ్యారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య, ఎన్నికలకు ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఇందులో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే పాల్గొన్నారు.