NLG: నల్లగొండ, విద్యానగర్ కాలనీకి చెందిన బాలగోని శ్రీనివాస్ గౌడ్ (43) బుధవారం రాత్రి మృతి చెందారు. మృతుడు శ్రీనివాస్ పార్దివదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు కాలేజీలోని అటానమి విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ పుష్పమాల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అమీర ఆఫ్రోజ్లకు శ్రీనివాస్ పార్థివదేహన్ని అందించారు.