AP: మొక్కజొన్న కొనుగోలు అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉన్నతాధికారులు, ప్రైవేటు సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడొద్దని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.