WGL: నల్లబెల్లి BRS పార్టీ కార్యాలయంలో ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది దర్శన్ రెడ్డి పాల్గొన్ని మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.