VSP: బీఎల్వోలకు అన్ని ఎన్నికల ప్రక్రియలపై పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టరేట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈఆర్వోలు- ఏఈఆర్వోలు క్రమం తప్పకుండా శిక్షణలు ఇవ్వాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ స్టేషన్ల మ్యాపింగ్‌పై ఇప్పటికే శిక్షణలు నిర్వహించామని కలెక్టర్‌కు అధికారులు తెలిపారు.