JN: స్టేషన్ ఘనపూర్ పట్టణంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేటీఆర్‌పై మండిపడ్డారు. కేటీఆర్ కుటుంబ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కవిత పార్టీ విడిచిపోవడం, హరీష్ రావుకు నాయకత్వంపై నమ్మకం లేకపోవడం ఇందుకే నిదర్శనమన్నారు. కేసిఆర్ ఉన్నంతవరకే బీఆర్ఎస్ నిలుస్తుందని, తరువాత పార్టీ చెదిరిపోతుందని వ్యాఖ్యానించారు.