SRCL: తెలంగాణ దళిత పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడిగా ఎర్ర వినయ్‌ను నియమించినట్టు రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ తెలిపారు. ఈ మేరకు తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలో వినయ్‌కు నియామక పత్రాన్ని TDPS నేతలు అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ.. తన నియమకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగేష్, అనిల్ పాల్గొన్నారు.