SKLM: రైతులు ఆధునిక వ్యవసాయం మెలకువలు నేర్చుకుని లాభసాటి వ్యవసాయం చేయాలని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. మెలియాపుట్టి మండలం మర్రిపాడులో “రైతన్న-మీకోసం” కార్యక్రమంలో ఇవాళ ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రైతులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధుల ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నట్లు రైతులకు వివరించారు.