W.G: పరిశుభ్రత పాటిస్తే సగం రోగాలు దరిచేరవని ఉండి ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. ఉప్పులూరులో గురువారం పంచాయతీ, డ్వాక్రా, యండగండి పీహెచ్సీ సిబ్బందితో కలిసి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. వీధులు, డ్రైన్లను శుభ్రం చేసిన అనంతరం.. ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేపట్టారు. ప్రజలంతా పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు