ADB: గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. నేరడిగొండ మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన గోండగూడను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం సందర్శించారు. తాండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత మాజీ CM కేసీఆర్కు దక్కుతుందని పేర్కొన్నారు. ఈ గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.